కనురెప్పల చీల్చుకు వచ్చిన వెలుగు రేఖ
కలల కావ్యాలను తరిమేస్తున్న మెరుపు తీగ...
ఎంతకీ కనుల కొలనుని వదలనంటున్న చిలిపి కోరిక
శిలలా పడి ఉన్న ఆశ తొడిగిన దుస్తుల కలయిక
లేవకుండా పడుకోపెడుతున్న వెర్రి కోరిక
పారిపోతున్న తీరాలని వెంటాడి పట్టుకోవాలన్న వింత నడవడిక
భ్రమ అని తెలిసీ కలల చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రాణ చిలుక
పసి హృదయం పరితపిస్తున్న గోడు తెలియక
యద పోరాడుతూనే ఉంది కల పగల కొడుతున్న పగలు కేక
చెప్పాలని ఉంది చేరుకొమ్మని నను జాగు చేయక
చెదరగోడుతున్న ఉదయకాన్తిని దరి చేరనీయక
ఎదురు చూస్తున్న నీ హృదయానికి హత్తుకోమ్మనక
విలపిస్తోంది చెలియా కను నీ కల వీడక
--- అల (శ్రీనివాస్)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి