8, మే 2010, శనివారం

parugu


పెద్ద పాథశాల వీడి పరుగు తీసాం
పట్నంలో చదువుదామని ఉరకలేసాం
నవతరపు హీరోలమని చొక్కలేగారేసాం
పంజరమోదిలి నింగికెగసిన పక్షులమయ్యాం
కొత్త కలల లోకానికి తలుపు తీసాం
వింత వింతల అభిరుచులను స్వాగాతిన్చాం
కొత్త పాతలు అన్నవేవి ఆలోచించం
ఆత్మీయత చూపగానే ఆహ్వానిస్తాం
అందరామోకతని తలచి కేకలేస్తాం
కప్పు చాయతోనే రోజులన్నీ తిప్పివేస్తాం
ఆర్టీసి  బస్సు మాకు రాజ వాహనం
వెలుగుతున్న సుర్యులల్లె భూమినంత చుట్టివేస్తాం
నగరమంతా నగారా 

Cheliya nee kala veedaka

కనురెప్పల చీల్చుకు వచ్చిన వెలుగు రేఖ
కలల కావ్యాలను తరిమేస్తున్న మెరుపు తీగ...
ఎంతకీ కనుల కొలనుని వదలనంటున్న చిలిపి కోరిక
శిలలా పడి ఉన్న ఆశ తొడిగిన దుస్తుల కలయిక
లేవకుండా పడుకోపెడుతున్న వెర్రి కోరిక
పారిపోతున్న తీరాలని వెంటాడి పట్టుకోవాలన్న వింత నడవడిక
భ్రమ అని తెలిసీ కలల చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రాణ చిలుక
పసి హృదయం పరితపిస్తున్న గోడు తెలియక
యద పోరాడుతూనే ఉంది కల పగల కొడుతున్న పగలు కేక
చెప్పాలని ఉంది చేరుకొమ్మని నను జాగు చేయక
చెదరగోడుతున్న ఉదయకాన్తిని దరి చేరనీయక
ఎదురు చూస్తున్న నీ హృదయానికి హత్తుకోమ్మనక
విలపిస్తోంది చెలియా కను నీ కల వీడక

--- అల (శ్రీనివాస్)