నా హృదయం ఎవరినో ఆహ్వానిస్తుందో
అని అనుకునే వాడిని
అది తన సగ భాగం పక్కనే ఉందని తెలియక ప్రపంచం లో వెదుకుతుంది
అలా దూర తీరాలను వెమ్బదిస్థూనె ఉంది
ప్రతి విషయం, బాధ, ఏడుపు, ప్రేమ, ఆనందం ఇంకా ఎన్నో విషయాలు
పన్చుకున్తూనె ఉంది తన స్నేహంతో, కాని స్నేహాన్ని నేనసలు గుర్తించనే లేదు
ఎప్పుడు ఎంతో ఓదార్పుగా వినే స్నేహం
ఎంతో ఉత్సాహాన్ని ఇచే స్నేహం
తన హృదయం సైతం అందించిన స్నేహం
తనలో తను చెప్పాలని చెప్పలేక బాధ భరిస్తూ
నా ప్రతి భావాన్ని పంచుకున్న స్నేహం
తెలియని ఉత్సాహంతో కళ్ళు తెరిచాను
ఏదో భావ వ్యక్తీకరణ జరగబోతోందన్న సంతోషం నాలో తేలియాడుతోంది
ఉదయం నుంచి సాయంకాలం కోసం ఎదురు చూస్తున్న నా కనులు
పరితపించి పోతున్న నా హృదయం
పది దాటింది, పదకొండు దాటింది, నా యదలో తెలియని ఒక ఆవేశపు ఎదురుచూపు
పెదవి దాటి కదిలింది ఒక చిన్న ఓదార్పు, నీకు నేనున్నాను అని, నా తోడుగా నడిచోస్తావా అని
ఎప్పుడు వినని యద సవ్వడి వినపడుతోంది, గుడి గంటై వినపడుతోంది
ప్రపంచం అంత చీకట్లో నిద్ర పోతోంది, నకిప్పుదిప్పుడే తెల్ల వారిన్దనిపిస్తోంది
హైదరాబాద్ మహా నగరంలో నేనొక్ ఏకాకిని
తన మాట విన్నాక పెదవి విప్పలేని ఆశ దాసుడిని
కొండంత ఆత్మ స్థైర్యం, అర్ధం కాలేని మొరటు ధైర్యం
నా స్నేహం నాతో చెప్పిన మాట తెలిసింది తను నన్ను
ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తోందని
సెలఎరులైనవి నేలవుకోరిన కళ్ళు
మది దాటి ఎగురుతున్నవి, యద లయల పరవళ్ళు
చివరి దాక వస్తావా అని అడిగాను, నీ స్వసనై ఉంటాను అంది
ప్రేమ అనే కొత్త పదం నాలో నా మీద జీవితం మీద కొత్త ఆశలు చిలికరించై
ఇది నా శ్రీలత నాకు తొలి సారి చెప్పిన అనుభూతి
శ్రీనివాస్
10, జులై 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
